Salaries | కీసర, జూన్ 28 : మూడు నెలల నుంచి మున్సిపాలిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. గత మూడు నెలల నుంచి దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర వార్డు కార్యాలయంలో పనిచేసే మున్సిపాలిటీ సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో తాము ఏ విధంగా జీవించాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
నడుం వంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి రోజు పనులు చేస్తున్నామని, ప్రభుత్వానికి తమ జీతాల గురించి పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడే దిక్కులేకుండా పోయాడన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తాము ఏండ్ల నుంచి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తమకు పెండింగ్ ఉన్న 3 నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని మున్సిపాలిటీ సిబ్బంది కోరుతున్నారు.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం