చర్లపల్లి : దివ్యాంగుల చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర సర్కారు కుట్ర చేస్తుందని దివ్యాంగులహక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, అడవయ్యలు అన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్లో ఎన్పీఆర్డీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి ఆధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల కోసం రూపొదించిన చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొవడం సరికాదన్నారు.
ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లు అమలు చేయకుడదని కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. 2016దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని మారిస్తే దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను ఉపసంహరించుకొవాలని, లేకాపోతే పెద్ద ఎత్తున అందోళన చేపడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు షాహిన్‌బేగం, చంద్రమోహన్, మల్లేశ్, శ్రీనివాస్, రిజ్వాన్‌బేగం, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.