Achiever Award | మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 4 : నాగారం మున్సిపాలిటీ కమిషనర్‌కు అచీవర్ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో జరిగిన తెలంగాణ రాష్ర్ట మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరం 80 శాతం ఇంటి పన్నులు వసూలు చేసినందుకు నాగారం మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డికి అచీవర్ అవార్డు అందుకున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ 85 శాతం ఇంటిపన్నులు వసూలు చేసినందున కన్సిస్టెంట్ అచీవర్ అవార్డును కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్(సీడీఎంఏ) శ్రీదేవి చేతుల మీదుగా ఎస్ భాస్కర్ రెడ్డి అందుకున్నారు.
మున్సిపాలిటీ అభివృద్థితోపాటు ప్రజా సమస్యల పరిష్కారం, మౌళిక సదుపాయాల కల్పనలో తనకు సహకరించి ఇంతటి విజయానికి కారణమైన తోటి అధికారులు, సిబ్బందికి కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్