MLC Shambipur Raju | దుండిగల్, ఏప్రిల్ 1 : ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు తెలిపారు. ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్లోని ఆయన కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, వివిధ సంఘ సభ్యులు ఇవాళ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు పలు సమస్యలు తెలియజేయడంతోపాటు వాటిని పరిష్కరించాలని విన్నవించారు. వాటికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
అదేవిధంగా ఈ నెల 6వ తేదీన పలు ప్రాంతాల్లో జరగబోయే శ్రీ రామ నవమి ఉత్సవాల వేడుకల్లో పాల్గొనాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి