Bandaru Laxmareddy | కాప్రా, ఏప్రిల్ 23 : ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ ఏఎస్ రావు నగర్ డివిజన్లోని కమలా నగర్లో రూ.30 లక్షలు, శ్రీనివాస్ నగర్లో రూ.50 లక్షలు, భవాని నగర్లో రూ.20 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులు, మార్కండేయ నగర్ నుంచి సుబ్రహ్మణ్య నగర్ వరకు రూ.220 లక్షలతో చేపట్టే బాక్స్ డ్రైన్ పనులు, మొత్తం రూ.3.2 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని అన్నారు. ఆయా కాలనీల్లో తన దృష్టికి వచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డీఈఈ బాలకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, బేతాల బాలరాజు, కుమారస్వామి, షేర్ మణెమ్మ, యాకయ్య, లక్ష్మీనారాయణ పటేల్, ఏఈలు, కాలనీ సంఘాల ప్రతినిధులు రాఘవరెడ్డి, పెంటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి