Murder | పేట్ బషీరాబాద్: కొంపల్లి ఫ్లై ఓవర్ (నిర్మాణం లో ఉన్న బ్రిడ్జి) కింద నర్సింహులు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మద్యం మత్తులో అడ్డా కూలీల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. హత్యకు గురైన వ్యక్తి అడ్డా మీది కూలీ నర్సింహులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.