Mobile Transformers | కుత్బుల్లాపూర్, మార్చి18 : వేసవిలో తలెత్తే కరెంటు కొరతను తీర్చేందుకు అత్యవసరంగా వినియోగంలోకి తెచ్చే కరెంటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఇవాళ మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎస్ఈ రవికుమార్ మాట్లాడుతూ.. అధిక లోడ్ వలన అప్పుడప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి ఎదురవుతుందన్నారు.
రాత్రి, పగలుఎండలతో, ఉక్కపోతతో ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా కరెంటు సమస్య లేకుండా నిర్విరామంగా అందించేందుకు ఈ మొబైల్ ట్రాన్స్ఫార్మర్ల అవసరం ఏర్పడుతుందన్నారు. కరెంటు సమస్య ఎదురయ్యే ప్రాంతాల్లో సంబంధిత విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొస్తే క్షణాల్లో సమస్యలు పరిష్కరించేందుకు తమ అధికార యంత్రాంగం, సిబ్బంది నిర్విరామంగా అందుబాటులో ఉన్నామని తెలిపారు.
ఇలాంటి వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డివిజన్ డి ఈ శ్రీనాథ్ రెడ్డి, జాన్ పోతరాజు, ప్రత్యేక అధికారి లీలా ప్రసాద్, కుత్బుల్లాపూర్ సబ్ డివిజన్ ఏడిఈ శ్రీకాంత్, కొంపల్లి ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్