హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కన్నెపల్లి పుంపు హౌస్ పరిశీలనం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బయలుదేరారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ప్రమాదవ శాత్తు కారు తగలటంతో గాయపడినట్లు సమాచారం. దీంతో ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్‌హౌజ్ మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి కేటీఆర్‌ను కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది.