Chalo Warangal | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 21 : వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివెళ్లేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. సభ నేపథ్యంలో ఇవాల ఛలో వరంగల్ వాల్ పోస్టర్ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఉద్యమకారుడు సంపత్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, మాజీ ప్రజా ప్రతినిధులు కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. అడుగడుగునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని స్వరాష్ట్ర సాధనతో బంగారుమయంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. పండుగ వాతావరణంలో జరుపుకునే ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా తరలివెళ్లేలా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్ సీనియర్ నాయకుడు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, గుమ్మడి మధుసూదన్ రాజు, నరేందర్ రెడ్డి, ఎల్లా గౌడ్, అనిల్, పులి మహేష్, నిజాంపేట్ కార్పొరేషన్ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటి మేయర్ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు మురళీ యాదవ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం