జీడిమెట్ల : కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ యూనిట్-1 యూనియన్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వివేకానంద్‌ను కార్మికులు ఎన్నుకున్న సందర్భంగా కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్కేవీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులంతా ఐకమత్యంగా ఉంటూ ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకరావాలన్నారు.
కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు, సౌకర్యాల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పోరాడి సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.ప్రసాద్, ఎం.శ్రీనివాస్, రాజీరెడ్డి, ప్రసాద్, ప్రవీణ్‌కుమార్, సత్తిరాజు, శ్రీను, ఫన్నీ, ఉమామహేశ్వరరావుతో పాటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.