గాజులారామారం, ఆగస్టు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఏ ఆపద వచ్చినా ముందుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని రోడామేస్త్రీనగర్ బిలో నివాసం ఉంటున్న మహమ్మద్ జిలానీ కూరగాయాలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు జిలానీ ఇల్లు శుక్రవారం కూలిపోవడంతో ఇంట్లో ఉన్న అతని కోడలు, మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ శనివారం ఆయన నివాసానికి వెళ్ళి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీలానీ కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహయం అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమలాకర్, పరుష శ్రీనివాస్‌యాదవ్, ఆబిద్, సింగారం మల్లేష్, రాజు, ఇబ్రహీం, చెట్ల వెంకటేష్, ఫర్జానా బేగం, ఎండి.నిజాముద్దీన్, మోసీన్ తదితరులు పాల్గొన్నారు.