అల్వాల్ ఫిబ్రవరి 19 : మచ్చబొల్లారం ఆర్యూబీ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అధికారులను అదేశించారు. ఆర్యూబీ నిర్మాణంపై సంబంధిత అధికారులతో కలసి గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మచ్చబొల్లారం రైల్వే గేటు వద్ద తరుచుగా ఏర్పాటుడుతున్న ట్రాఫిక్ రద్దీతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టామన్నారు.
నిర్మాణం పూర్తయితే సమయభావం తగ్గి ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టి స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని తెలిపారు. సమావేశంలో రైల్వే, మున్సిపల్, రెవెన్యూ, జలమండలి అధికారులు పాల్గొన్నారు.