BRS | బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు కీలకమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
నేరేడ్మెట్, మే 5: బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు కీలకమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని 188 డివిజన్ నేరేడ్మెట్, 189 కౌకూర్ యాప్రాల్ డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాలకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖ్ర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయి కమిటీలను సమర్ధవంతంగా ఏర్పాటు చేసి పార్టీని గ్రామ స్థాయమి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి ఓటర్ల హక్కులను పరిరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యకర్తల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఆయన వారి సూచనలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చా. ప్రతిపక్షంలో ఉన్నప్పటికి మల్కాజిగిరి అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పనులుచేయిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

