MLA Marri Raja Shekarreddy | మల్కాజిగిరి, జూన్ 26: ప్రభుత్వం బస్తీలు, కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం కుషాయిగూడ బస్ డిపో మేనేజర్ మహేశ్ కుమార్ కు పలువురు నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం 17హెచ్ బస్ ఈసీఐఎల్ నుండి హెచ్బీ కాలనీ మీదుగా సికింద్రాబాద్కు నడుస్తుందన్నారు. అదే బస్సును ఈసీఐఎల్ , వడ్డెర బస్తీ, ఆర్టీసీ కాలనీ, షఫీ నగర్, జడ్టీఎస్, ఆనంద్ బాగ్, ప్రశాంత్ నగర్ ఫ్రోబెల్ స్కూల్ మీదుగా సికింద్రాబాద్కు కొత్తగా రూట్ లో బస్సులు నడపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మల్కాజిగిరి మండల విద్యాశాఖ అధికారి సురేష్, బిఆర్ఎస్ నాయకులు భాగ్యనంద్ రావు, మహమ్మద్ ఉస్మాన్, వంశీ ముదిరాజ్, ఆదినారాయణ, మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నర్సింగ్ రావు, మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి