MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, జూన్ 14 : ఆషాఢ మాస బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం బోయిన్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆషాడ మాస బోనాల కోసం దేవాలయాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని దేవాలయాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.
మచ్చ బొల్లారం మధురానగర్‌లోని శ్రీ వరసిద్ధి మహాగణపతి దేవాలయానికి రూ.65 వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాలకు ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలి రమేష్, లక్ష్మణ్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, జెకె సాయి గౌడ్, శంకర్, శ్రీనివాస్, సురేష్, రమా వివిధ ఆలయాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్