మల్కాజిగిరి, జూన్ 15: ఆషాడ మాస బోనాలను వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అదివారం బోయిన్ పల్లిలోని క్యాంపు కార్యాలయంలో దేవాలయాలకు ఆషాడ మాస బోనాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని దేవాలయాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలకుండా ఆలయ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయాలకు ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, జెకె సాయి గౌడ్, శంకర్, శ్రీనివాస్, సురేష్, రమా వివిధ ఆలయాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.