మల్కాజిగిరి, జూలై 10 : స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తనను నేరుగా కలువాలని సూచించారు. గురువారం బోయిన్ పల్లిలోని క్యాంపు కార్యాలయంలో మౌలాలి డివిజన్ హనుమాన్ నగర్ లోని స్మశాన వాటికను అభివృద్ధి పరచాలని కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వంశీ ముదిరాజ్, ఎండీ ఉస్మాన్, మారుతి ప్రసాద్, దుర్గేష్, స్వామి, జంగయ్య, బస్తీ వాసులు, కిరణ్ కుమార్, విజయలక్ష్మి, లక్ష్మి, పింటూ, విజయ్, సరస్వతి, లలిత, రాజమణి, ప్రవీణ్, కృష్ణ, సంగీత, శివమ్మ, విజయలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.