వినాయక్‌నగర్, మార్చి 6 : ప్రజల ఆరోగ్యం కోసం పార్కులలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వెంకటాపురం డివిజన్ ప్రూడెన్షియల్ కాలనీ పార్కులో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్‌కిశోర్ గౌడ్, విజయశేఖర్, కాలనీ కార్యదర్శి కృష్ణకుమార్, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.