మల్కాజిగిరి, జనవరి 19 : మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు. గౌతంనగర్ డివిజన్లోని రామాంజనేయనగర్లో రూ.29 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు గౌతంనగర్ కార్పొరేటర్ మేకల సునితతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తనవంతు కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ దివ్యజ్యోతి, రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.