మల్కాజిగిరి, నవంబర్ 13 : యునాని దవాఖాన ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మౌలాలిలోని ప్రభుత్వ యునాని దవాఖాను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.
పారిశుధ్య పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. రోగులకు మందులుతో పాటు ఇతర వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, ఉస్మాన్, హేమంత్ పటేల్, వంశీముదిరాజ్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.