Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి , ఫిబ్రవరి 18 : రంజాన్ మాసం సందర్భంగా మల్కాజ్‌గిరిలో ముస్లింల కోసం ట్ షాపింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రంజాన్ పై సమీక్ష సమావేశంలో మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని మసీదులకు సంబంధించిన సదర్ల(ప్రెసిడెంట్ )తో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నెలాఖరున ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసే ముస్లిం సోదరులకు మంచి నీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు కృషి చేయాలని కోరారు. శానిటేషన్ సిబ్బంది రంజాన్ మాసంలో ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని అన్నారు. పాత బస్తీ లో ఏర్పాటు చేసిన విధంగా రాత్రి సమయాల్లో షాపింగ్‌కు మల్కాజ్‌గిరిలో కూడా సముదాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముస్లింల పక్షాన మాట్లాడడం చూసి ఎంఐఎం తర్వాత ముస్లింల కోసం పోరాటం చేసే ఏకైక నాయకుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అని మజ్లిస్ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గ ముస్లిం పెద్దలు , మసీదుల సదర్లు పాల్గొన్నారు.