MLA Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, మే 17: నేరేడ్ మెట్‌లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం రాజగోపురాన్ని ఇవాళ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. రాజగోపురం శిఖర ప్రతిష్ట పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయం ఏర్పడి 100 ఏండ్లు అవుతున్న సందర్భంగా రాజగోపురాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు. దేవాలయంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షధారణం, యాగశాల ప్రవేశం, దేవత ఆహ్వానం అగ్ని ప్రతిష్ట గణపతి హోమం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో రాజగోపురం ప్రతిష్ట దాతలు రవీంద్ర దత్త, రంజిత, జి అనిల్ కుమార్. రోజా వేముల సతీ సమేత నవగ్రహ ప్రతిష్టా దాతలు గంట ప్రవీణ్, ఆలయ అధ్యక్షుడు బిఎం రాజారాం, జిఎం రమేష్, ఏ రాజు, సత్యనారాయణ, కృష్ణ, గణేష్, విజయ్ కుమార్, సువర్ణ, లక్ష్మి, శివకుమార్, మహేశ్వరి, మీనా, ఉమాదేవి, జగదీష్, వేదవత్, నవీన్, స్నేహ, భావన, ప్రణతి, ప్రశాంతి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Mirchowk | మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే?.. వివరించిన అధికారులు
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Javed Akhtar | నరకానికి అయిన వెళ్తాను కానీ పాకిస్తాన్‌కు వెళ్లను : జావేద్ అక్తర్