మల్కాజిగిరి, డిసెంబర్ 14 : కాలనీల అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్‌గౌడ్ ఆధ్వర్యంలో విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీవాసులు ఆదివారం ఎమ్మెల్యేను కలిశారు. ఈసందర్భంగా కాలనీలోని సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రం అందజేశారు. దోమల నివారణ, పాముల సంచారాన్ని అరికట్టేలా కాలనీలో బాక్స్ డ్రైన్ నిర్మించాలని కోరారు.
అదేవిధంగా రోడ్లు నిర్మించాలని, త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా ఇవ్వాలని, పలు సమస్యల పరిష్కారానికి చేయుతనందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేస్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రణాళికతో ముందుకుసాగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి నాగరాజు, రామారావు, శర్మ, లింగమూర్తి, బీటీ.నాయక్, రాంచందర్, రవీందర్, పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.