MLA Mallareddy | బోడుప్పల్, జూలై 8: అనివార్య కారణాలవల్ల నిలిచిపోయిన బొడుప్పల్ దళితుల ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వెంటనే కొనసాగించాల్సిందిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి మంగళవారం కోరారు. ఈ మేరకు స్థానిక నాయకులు వజ్రేష్ యాదవ్, సంజీవరెడ్డి, దళితులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ… బోడుప్పల్ రెవెన్యూ సర్వేనెంబర్ 63/2 నుండి 63/25 లోని 234 ఎకరాల దళితుల భూమి ల్యాండ్ పూలింగ్ కింద గత ప్రభుత్వం అభివృద్ధి చేసి దళితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆగిపోవడంతో దళితులు తీవ్ర నిరాశతో ఉన్నారని ఆయన తెలిపారు.
15 రోజుల్లో సమస్యను పరిష్కరించి రావాల్సిన వాటాను అందించి దళిత రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో బొడుప్పల్ దళిత నాయకులు మీసాల కృష్ణ, చిన్నింగుల కుమార్, చంటి శ్రీను, ఉపేందర్, నరసింహ, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Amberpet | రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
Trade Deal | త్వరలో అమెరికాతో భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. కీలక సూచనలు చేసిన జీటీఆర్ఐ..
Horror | దెయ్యం వదిలిస్తామంటూ నాలుగు గంటలు చిత్రవధ.. దెబ్బలు తాళలేక మహిళ మృతి..