కాప్రా, మే 6 : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో అన్ని కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టడం ద్వారా కాలనీల్లో కాలుష్యం, అపరిశుభ్ర పరిస్థితులు తలెత్తకుండా ఉండేదుకు అవసరమైన అన్ని చర్యలు చేపడ్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజన్ వెస్టర్న్ బ్లిస్ -మెహర్‌బాబా కాలనీల ప్రాంతంలో రూ.46లక్షలతో చేపట్టే భూగర్భడ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కాలుష్య సమస్యలు తగ్గించడంలో, అపరిశుభ్రత పరిస్థితులు తలెత్తకుండా ఈ యూజీడీ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాలనీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బైరి నవీన్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్థానిక కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.