మేడ్చల్ మల్కాజిగిరి : అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని ,తొమ్మిదేండ్ల పాలనలో నిరూపితమైందని సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృష్ణారావు సమక్షంలో అల్లాపూర్ డివిజన్ రామారావునగర్కు చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అరవై ఏండ్లలో పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ ఈ తొమ్మిది సంవత్సర్లా పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. బాలానగర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్లు, కేపీహెచ్బీ కాలనీలో రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించామని.. తాగునీరు, విద్యుత్ సరఫరా మెరుగైందని చెప్పారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చేసిన అభివృద్ధి కండ్లముందు కనబడడంతో ఆయా పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో చేరిన నాయకులు బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.