Doddi komuraiya | బాలానగర్, ఏప్రిల్ 3 : తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య పాత్ర చిరస్మరణీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇవాళ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్ పేట అంజయ్య నగర్లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమానికి కృష్ణారావుతోపాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య చూపిన చొరవ ఎనలేనిది అన్నారు. ప్రజల దుర్భరమైన పరిస్థితులను నివారించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్ గౌడ్, కర్రే జంగయ్య, ఇర్ఫాన్, మేకల హరినాథ్, మక్కల నర్సింగరావు, రాజయ్య, లింగం, సంపత్, హైలెష్, తిరుపతి, పోచయ్య, మక్కాల సత్యనారాయణ, బాలరాజ్ నగేష్, పిట్ల రాజు ముదిరాజ్, అశోక్, ఉమా, బురి యాదగిరి, మోహన్ ముదిరాజ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు