చర్లపల్లి, నవంబర్ 10 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మినగర్లో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి, అభయ అంజనేయ స్వామి, నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆయన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ఆలయాలలో సౌకర్యాలు కల్పించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆలయాలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆలయ పూజారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.