ఉప్పల్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని పార్కులను ప్రణాళికాబద్దంగా అభివృద్ధిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
కాప్రా, మే 13 : ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని పార్కులను ప్రణాళికాబద్దంగా అభివృద్ధిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కాప్రాడివిజన్ సైనిక్‌పురి పార్క్‌లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్క్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందులోభాగంగా పార్క్ పరిసరాల్లో వాష్‌రూమ్‌లు, ఇతర అభివృద్ధిపనులను సీనియర్ సిటిజన్లతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పార్కు పరిసరాలు, నార్త్ఎండ్లో సీసీ రోడ్డు, ఇతర అభివృద్ధిపనులకు రూ.25లక్షల నిధులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. సైనిక్‌పురి ప్రాంతం అభివృద్దికి కట్టుబడి ఉన్నాననీ, పార్కులకు వచ్చే వృద్ధులు, మహిళలు, పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు బైరి నవీన్‌గౌడ్, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు,బీఆర్ఎస్ నేతలు, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

