కాప్రా, నవంబరు 2 : ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని కాలనీలను అభివృద్ది చేయడమే లక్ష్యమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కాప్రాడివిజన్ పరిధిలోని కాప్రా చెరువు అలుగు -ఎల్లారెడ్డిగూడ సీసీ రోడ్డు, శ్రీసాయిశివనగర్ (ఆర్టీసీ కాలనీ) సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీలను అభివృద్ధిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు.
కాలనీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తెస్తే వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు. కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ, సీసీరోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైరి నవీన్‌గౌడ్, ఆయా కాలనీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.