మల్లాపూర్, సెప్టెంబర్ 18 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అభివృద్ధి పనులలో భాగంగా ఆయన గురువారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్సీ బస్తీ, ఓల్డ్ మల్లాపూర్, ఎస్వీనగర్ కాలనీలలో రూ.70 లక్షల వ్యయంతో స్ధానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి డివిజన్లలో ఎలాంటి సమస్యలున్నా ఆయా కార్పొరేటర్ల దృష్టికి తీసుకువస్తే సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని కాలనీవాసులకు సూచించారు.
జరుగుతున్నటు వంటి అభివృద్ది పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సదరు కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం అభివృద్ధి పనుల పరిశీలన..మల్లాపూర్ డివిజన్ ఎలిఫెంట్ చౌరస్తాలో మహనీయుల విగ్రహాల ముందు అత్యాధునిక హంగులతో కోటీ 13 లక్షలతో జరుగుతున్నటు వంటి అభివృద్ధి పనులను కార్పొరేటర్ దేవేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతు గార్డెనింగ్, ఫుట్‌పాత్, ఆకృతిల అభివృద్ధి పనులపై చర్చించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీ రూప, ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు, స్ధానిక కాలనీవాసులు పాల్గొన్నారు.