చర్లపల్లి, జనవరి 7 : ఉప్పల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్‌లో ఎమ్మెల్యే , బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులతో కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కృష్ణారెడ్డినగర్‌లో డ్రైనేజీ పనులు పూర్తయిన వెంటనే రహదారుల నిర్మాణం పనులు చేపట్టనున్నామన్నారు.
అదేవిధంగా కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించి, విధిదీపాల నిర్వహణ మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీలను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, జయకృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి, కడియాల అనిల్‌కుమార్, బాల్‌రాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.