చర్లపల్లి, సెప్టెంబర్ 21 : నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని సోనియాగాంధీనగర్‌లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సెక్టార్ ఎస్సై సాయిలుతో కలిసి ఆయన ప్రారంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలకమైన కేసుల ఛేదన, నేరాలను నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు.
కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న సోనియాగాంధీ నగర్‌ను అదర్శంగా తీసుకొని మిగత కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొవాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు దాతలు మందుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మహేశ్‌గౌడ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, వేముల కృష్ణ, కాలనీ ప్రతినిధులు వెంకటేశ్, సత్యేందర్, మంగ, అప్పారావు, రమణ, సుబ్బారావు, అంజమ్మ, శ్యామ్, బసవయ్య, ఉప్పలయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.