MLA Lakshma Reddy | కాలనీల సర్వతోముఖాభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల సర్వతోముఖాభివృద్ధికి ఎల్లవేళలా కృషిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
కాప్రా, మార్చి 12 : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల సర్వతోముఖాభివృద్ధికి ఎల్లవేళలా కృషిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కాప్రాడివిజన్ పరిధిలోని తిరుమల శివపురికాలనీలో రూ.1 కోటి 48 లక్షల 50వేల వ్యయంతో చేపట్టే బీ.టీ. రోడ్డు నిర్మాణం పనులు, శాలివాహన కాలనీలో రూ.95లక్షల వ్యయంతో చేపట్టే భూగర్భడ్రైనేజీ పనులు, సీఎస్ నగర్లో రూ.30లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణం పనుల (మొత్తం రూ.2కోట్ల73లక్షల యాభైవేలు)కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను దశల వారీగా పరిష్కరించి, ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రాడివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు బైరి నవీన్‌గౌడ్, డీఈఈ బాలకృష్ణ, ఏఈ స్రవంతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బద్రుద్దీన్, బైరి భాస్కర్‌గౌడ్, ఇంద్రయ్య, గిల్బర్ట్, రవీందర్రావు, యు.శ్రీనివాస్, సీఎస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రఘురాంరెడ్డి, ఆయా కాలనీల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

