MLA Bandari Lakshma Reddy | చర్లపల్లి, జూలై 12 : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్, సప్పడి శ్రీనివాస్‌రెడ్డిలు పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ వీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన జ్యోతికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదని, లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సౌకర్యాలు కల్పించారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పీసీ రెడ్డి, ప్రసాద్రెడ్డిలతోపాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
విద్యారులు అన్ని రంగాల్లో రాణించాలి : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
రామంతా పూర్, జూలై 12 : విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నాచారం విద్యాభారతి హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
విద్యార్థులు కష్టపడి చదివి సమాజానికి తల్లిదండ్రుల కు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ గ్రేటర్ నాయకుడు సాయి జెన్ శేఖర్, స్కూల్ ప్రిన్సిపాల్ బాల వీర రెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి