రామంతపూర్ మార్చి 18 : హాబ్సిగూడ డివిజన్ పరిధిలోని వెంకట్ రెడ్డి నగర్‌కు చెందిన వెంకటయ్య అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఎల్ఓసీని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అతని ఇంటికి వెళ్లి 2 లక్షల 50 వేల రూపాయల చెక్కును బాధితుడికి అందజేశారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే బండారి మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధిని అందరు వినియోగించుకోవాలన్నారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేతన హరీష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి ,సీనియర్ నాయకులు సోమి రెడ్డి, డాక్టర్ బి.వి చారి, మాజీ కౌన్సిలర్ కైలాష్ పతి గౌడ్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.