ఉప్పల్, జూన్ 29 : చిలుక నగర్ డివిజన్ కి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్త రేణుక ముదిరాజ్ కూతురు సంధ్య సంస్కృతి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. వారి ఆర్థిక పరిస్థతి బాగాలేక భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు గుడి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో సంధ్యకి ల్యాప్ టాప్ని వారి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన సొంత నిధులతో పేద కుటుంబానికి అండగా నిలుస్తున్న గుడి మధుసూధన్ ని అందరూ స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిలుక నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.