ఉప్పల్ జనవరి 5 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అభివృద్ధి పనులలో భాగంగా సోమవారం మల్లాపూర్ డివిజన్ ఓల్డ్ మల్లాపూర్‌లోని, బీసీ ఏరియాలో, మైనార్టీ బస్తీలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి 22 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లలో దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాలనీలలో ఎక్కడైన పెండింగ్ పనులు ఉన్నట్లయితే వెంటనే కార్పొరేటర్ దృష్టికి తీసుకురావాలని సమస్యలను పరిష్కరించే విధంగా తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.
అభివృద్ధి పనులలో నాణ్యా ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఓల్డ్ మల్లాపూర్‌లోని పలు బస్తీల్లో కార్పొరేటర్‌తో పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సిరాజుద్దీన్, స్థానిక నాయకులు, బస్తీవాసులు, ఎస్వీ శివకుమార్, శ్రీనివాస్‌గౌడ్, కటార్ల భాస్కర్, తండా వాసుగౌడ్, నెల్లుట్ల శ్రీనివాస్‌గౌడ్, ఉస్మాన్, అల్లాడి కృష్ణయాదవ్, ఉమారాణి, పావని, గణేష్, కృష్ణ, రాపోలు శ్రీను, రఘు, నరహరిగౌడ్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.