MLA Bandari Lakshma Reddy | కాప్రా, మార్చి 29 : పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. ఇవాళ ఏఎస్ రావు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్ల ఇమామ్, మౌజంలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని సొంత నిధులతో కొత్త దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ముస్లిం సోదరులు కుటుంబసమేతంగా రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..