మేడ్చల్ రూరల్, ఆగస్టు : ప్రజా సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ చెక్‌లను బుధవారం పంపిణీ చేశారు. చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మనసున్న మారాజుని అభివర్ణించారు.
కరోనాతో ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడ్డా ఎక్కడా సంక్షేమాన్ని ఆపలేదన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు తదితర పథకాలు యధావిధిగా కొనసాగించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో సీఎం పేదింటి పెద్దన్నగా మారారన్నారు. ఎన్నో కుటుంబాలు లబ్ధి పొంది, కేసీఆర్‌ను దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, జైపాల్‌రెడ్డి, బేరి బాలరాజు, పెంటయ్య, రజితావెంకటేశ్, రాజకుమారి సుధాకర్, ఆంథోనమ్మఫిలిప్స్, కోఆప్షన్ సభ్యురాలు జయశ్రీజనార్దన్ రెడ్డి, నాయకులు సంజీవగౌడ్, రవీందర్‌గౌడ్, సురేందర్ గౌడ్, రాము యాదవ్, మధుసూదన్, గౌస్‌ఖాన్, రాజేందర్, రాజేందర్ ముదిరాజ్, వెంకటేశ్, సుధాకర్, కమిషనర్ అమరేందర్ రెడ్డి, డీఈఈ చింజీవులు తదితరులు పాల్గొన్నారు.