హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సభ్యసమాజం తలదించుకునేలా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ ఎన్నికల సభలో రేవంత్రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై వ్యక్తిగత దూషణలకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఫ్యాక్షనిస్టుల్లా మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.