ఘట్కేసర్ : ముస్లింల సంక్షేమానికి సీఎం కేసీఆర్ (CM KCR) ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకుంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి( Minister Malla Reddy) అన్నారు. శుక్రవారం ఘట్కేసర్లో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రంజాన్(Ramzan) పండుగ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు, విందులు ఇస్తూ అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చే బీజేపీ,కాంగ్రెస్‌లు ఓట్ల కోసమే పనిచేస్తాయని, బీఆర్ఎస్(BRS) మాత్రం అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను సంపూర్ణంగా అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీ లు పుర్తి స్థాయిలో అభివృద్ధిని సాధించాయని అన్నారు.
నియోజకవర్గంలో మరోసారి తనకు ఓటేసి గెలిపించాలని, కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాక్షుడు పడిగెం వెంకటేశ్వరావు, నాయకులు ముల్లి పావనీ జంగయ్య యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్‌రెడ్డి, సుధాకర్, శ్రీనివాస్ గౌడ్, హరిశంకర్, సిరాజ్కార్యకర్తలు పాల్గొన్నారు.