పీర్జాదిగూడ/శామీర్‌పేట,ఆగస్టు 18: ఇటీవల సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు పథకం దేశం గర్వించదగ్గ పథకమని, దీంతో దళితుల దశ మారనున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలకలో మేయర్ జక్క వెంకట్‌రెడ్డితో కలిసి మేడిపల్లి మండల పరిధిలోని 44 మంది లబ్ధిదారులకు, శామీర్‌పేట మండలంలోని 54 మంది లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అంతకు ముందు సుమారు రూ. 1కోటి 34లక్షల నిధులతో పీర్జాదిగూడ నగరపాలక పరిధిలోని మల్లికార్జున్‌నగర్, శ్రీ సాయినగర్, విహారికకాలనీ, వివేకానందనగర్ కాలనీల్లో సీసీ రోడ్లు, ధరణికాలనీలో పార్కును నగరకపాలక మేయర్ జక్క వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆస రా లాంటి సంక్షేమ పథకాలతో పాటు రోడ్లు, డ్రైనేజీ, మిషన్‌భగీరథ తదితర అభివృద్ధిపనులు చేపట్టి రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు 70 ఏండ్లుగా దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్పా వారి సంక్షేమాన్ని ఏనా డు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. విమర్శలు, ఆరోపణలు మానుకొని ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించాలన్నారు.
పీర్జాదిగూడ కార్పొరేషన్లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ అనిత, నగరపాలక డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు శారద ఈశ్వర్‌రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, హరిశంకర్ రెడ్డి, నవీన్‌రెడ్డి, అనంతరెడ్డి, శుభాశ్నాయక్, మంజుల రవీందర్, అమర్‌సింగ్, పోచ య్య, సరిత దేవేందర్‌గౌడ్, రమ్యసతీశ్గౌడ్, రఘుపతిరెడ్డి నాయకులు, శ్రీధర్‌రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, బుచ్చియాదవ్, కోఆప్షన్ సభ్యులు కృష్ణాగౌడ్, పెంటయ్యగౌడ్, శామీర్‌పేటలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.జహంగీర్, వైస్ ఎంపీపీ సుజాత, రైతుబంధు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీడీవో వాణి, తహసీల్దార్ సురేందర్, సొసై టీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, మండల అధ్యక్షుడు సుదర్శన్, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,లబ్ధిదారులు, ఉన్నారు.