Prostitute Gang | దుండిగల్, జూన్ 5: బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకుడితోపాటు ఇద్దరు మహిళలను, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకొని వారి నుంచి కండోమ్ ప్యాకెట్స్, సెల్ ఫోన్లు, కొద్ది మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.
పోలీసుల కథనం ప్రకారం.. దుండిగల్ తండాకు చెందిన శివ నాయక్ (30) ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూ గత కొంతకాలంగా గండి మైసమ్మలోని దుండిగల్ మునిసిపాలిటీ కార్యాలయం సమీపంలో ఉన్న క్రికెట్ స్టేడియం వద్ద బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం అందింది. దీంతో మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు బుధవారం రాత్రి కాపు కాయగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఇద్దరు మహిళలతో గండి మైసమ్మ ప్రాంతానికే చెందిన మనోజ్, వంశీ అనే యువకులు వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఎస్ఓటి పోలీసులు మనోజ్, వంశీతో పాటు నిర్వాహకుడు శివ నాయక్, సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.500ల నగదు, 6 కండోమ్ ప్యాకెట్స్‌తో పాటు 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను దుండిగల్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విటులు మనోజ్, వంశీలలో ఒకరు దుండిగల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సోదరుడు కాగా, మరొకరు అటవీ శాఖకు చెందిన ఉద్యోగి కొడుకుగా తెలుస్తోంది. కాగా నిర్వాహకుడు శివనాయక్ గత కొంతకాలంగా సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఇతర ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను ఆన్లైన్లో బుక్ చేసి విటులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు