MLA Madhavaram Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 3 : ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఇవాళ కూకట్పల్లిలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న పకృతి విధ్వంసంపై ప్రజలకు అవగాహన కల్పించాలని.. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను ఏకం చేయాలన్నారు.
నాడు మాజీ సీఎం కేసీఆర్ హరితహారంతో ప్రకృతిని కాపాడితే.. నగరంలో ఆక్సిజన్ శాతం పెరిగిందని, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకలతో రాష్ట్రం పరిపూర్ణంగా ఉండేదన్నారు.. కానీ నేడు ఆ పరిస్థితులు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలను జాగృతం చేస్తూ.. ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎర్రవల్లి సతీష్ రావు, గోపరాజు శ్రీనివాసరావు, కలిదిండి రోజా, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, మెడిప్లస్ శ్రీనివాస్, సయ్యద్ ముజీద్, మారబోయిన రవి యాదవ్, శ్రీకాంత్, సాయి, మిద్దెల మల్లారెడ్డి, ఆర్కే గౌడ్, తిరుమలేష్, శ్రీనివాస్ గౌడ్, సలీం పాషా, బాబుమియా, ఎ.డి.వి శ్రీకాంత్, పండరి శ్రీకాంత్, నక్క శ్రీనివాస్, కలీం, వెంకటేష్ యాదవ్, వెంకట్రావు తదితరులు ఉన్నారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు