MLA Vivekananda | సభకు వేలాదిగా తరలివెళ్దాం.. మన బలాన్ని మరొక్కసారి చాటుదాం : ఎమ్మెల్యే వివేకానంద
MLA Vivekananda | ఇవాళ గాజులరామారం డివిజన్ యండమూరి ఎంక్లేవ్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించే సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్లి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
MLA Vivekananda | దుండిగల్, ఏప్రిల్ 21: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించే సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్లి విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే వివేకానంద పిలుపునిచ్చారు. ఇవాళ గాజులరామారం డివిజన్ యండమూరి ఎంక్లేవ్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ.. అభివృద్ధికి నోచుకోకుండా అడుగడుగునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని స్వరాష్ట్ర సాధన ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటుచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెం.1 స్థాయిలో నిలిపిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చిన నాయకుడు మన అధినేత కేసీఆర్ అని అన్నారు. ఇంతటి ఘనతను సాధించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లి మన బలాన్ని మరొక్కసారి చాటుదామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, డివిజన్ ఉపాధ్యక్షుడు ఇబ్రహీం ఖాన్, ప్రధాన కార్యదర్శి నవాబ్ భాయ్, యూత్ అధ్యక్షుడు తెలంగాణ సాయి, నాయకులు ఇమ్రాన్ బేగ్, మూసా ఖాన్, మక్సూద్, సుంకరి చందు, చెట్ల వెంకటేష్, ఆంజనేయులు, దూలప్ప, రంజాన్, మల్లారెడ్డి నగర్ ఫేస్ -2 అధ్యక్షుడు నాగభూషణం, మహిళా నాయకురాలు మామి, దుర్గా, ఊర్మిళ, సాజిదా, అనిత తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

