కీవ్: ఉక్రెయిన్(Ukraine)లో దేశాధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని ఆ దేశ మాజీ రక్షణశాఖ మంత్రి మైఖేల్ ఫెడొరోవ్ తెలిపారు. ఎన్నికలపై జెలెన్స్కీ విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలని ఆయన కోరారు. గత నెలలోనే ఫెడొరోవ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది. 2024 మే నెలలో జెలెన్స్కీ అయిదేళ్ల టర్మ్ ముగిసింది. కానీ కొత్త ఎన్నికలను నిర్వహించేందుకు ఆయన తిరస్కించారు.రష్యాతో 2022 ఫిబ్రవరి నుంచి యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మార్షియల్ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ టాప్ కమాండర్లతో యుద్ధం విషయంలో వ్యూహాత్మక విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఫెడొరోవ్‌ను ఇటీవల తప్పించారు. ఫెడొరోవ్ తన వీడియో సందేశంలో జెలెన్స్కీ సర్కారును తప్పుపట్టారు. అవినీతి పెరిగిపోయిందని, బాధ్యత.. పాదర్శకత లేదని ఆరోపించారు. ప్రభుత్వం వ్యవస్థీకత సంక్షోభంలోకి వెళ్తోందన్నారు.