నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy ) పై క్రమ శిక్షణ చర్యలు ( Disciplinary Action) తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్( Congress ) బాన్సువాడ నియోజకవర్గ పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు సమావేశ మందిర గేటు వద్ద శాంతియుత నిరసన చేపట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను పోచారం శ్రీనివాసరెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోచారం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయని నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ బీఫాంతో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పనులు కావడం లేదని, నిధులు విడుదల చేయడం లేదని పోచారం వాపోయారు.
మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని పోచారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారా లేపాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కోట్లాది రూపాయాలతో నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, అయితే కాంగ్రెస్‌లోకి వస్తే మరింత అభివృద్ధి చేయవచ్చనే ఆశ నీరుగారిందని ఆరోపించారు.