Sree Charani : అంతర్జాతీయ టీ20ల్లో భారత స్పిన్నర్ శ్రీచరణి (Sree Charani) చరిత్ర సృష్టించింది. ఇప్పటికే నంబర్ 1బౌలర్‌గా కొనసాగుతున్న ఈ మిస్టరీ స్పిన్నర్ అత్యధిక బౌలింగ్ రేటింగ్‌తో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న చరణి 817 పాయింట్లతో ఆస్ట్రేలియా పేసర్‌ను దాటేసింది. ఇదివరకు టీ20 బౌలర్లలో అత్యధిక రేటింగ్ మేగన్ షట్ పేరిట ఉండేది. కానీ.. ఇటీవల మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న ఈ తెలుగమ్మాయికి అగ్రస్థానం దక్కింది.
అంతర్జాతీయ టీ20ల్లో తిప్పేస్తున్న శ్రీ చరణి మరోసారి అత్యధిక రేటింగ్ పాయింట్లతో చరిత్ర సృష్టించింది. ఈ మధ్యే నంబర్ 1 టీ20 బౌలర్‌గా అవతరించిన ఈ తెలుగమ్మాయి కొన్ని రోజుల క్రితమే 800 పాయింట్ల క్లబ్లో చేరింది. తద్వారా ఈ మైలురాయిని అందుకున్న టీమిండియా తొలి బౌలర్‌గా చరణి మరో రికార్డు సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో రాణించిన తను.. ఏకంగా 817 పాయింట్లతో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. దాంతో.. గతంలో అత్యధికంగా 807 రేటింగ్‌తో మేగన్ షట్(ఆస్ట్రేలియా) రికార్డు కనుమరుగైంది. 2018 నవంబర్‌లో ఆసీస్ పేసర్ ఇన్నేసి రేటింగ్ పాయింట్లు సాధించింది. ఎనిమిదేళ్లు తిరిగే సరికి శ్రీ చరణి ఆమెను రెండో స్థానానికి నెట్టేసింది.
All hail Charani! 👑🙌 pic.twitter.com/OHx6wbMQMK
— Cricinfo (@cricinfo) September 29, 2026
ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రీ చరణి నంబర్ 1 ర్యాంక్ పట్టేసింది. నిలకడగా రాణిస్తున్న ఈ తెలుగమ్మాయి అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌లో తిప్పేసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది.

ఇంగ్లండ్‌పై (2025 జూన్ 28న) మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన చరణి.. తన స్పిన్ మ్యాజిక్‌తో టీమిండియా విజయాల్లో కీలకవుతూనే.. వ్యక్తిగతంగా తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. గతేడాది స్వదేశంలో 14 వికెట్లతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకమైందీ కడప బిడ్డ. తాజాగా ఆసియా కప్‌లో 12, ఆసియా క్రీడల్లో ఎనిమిది వికెట్లతో మెరిసింది చరణి.