UAE-Iran | యూఏఈపై ఇరాన్ మిస్సైల్ దాడి.. ఇరాన్‌తో అన్ని వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు రద్దు
UAE-Iran : ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ పొరుగునే ఉన్న యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో ఉన్న అన్ని వ్యాపార, వాణిజ్య ఒప్పందాల్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇరాన్ తమపై వరుసగా మిస్సైల్ దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం వెల్లడించింది.
UAE-Iran : ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ పొరుగునే ఉన్న యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో ఉన్న అన్ని వ్యాపార, వాణిజ్య ఒప్పందాల్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. తాజా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తమపై వరుసగా మిస్సైల్ దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం వెల్లడించింది. ‘‘యూఎస్-ఇరాన్ యుద్ధం కారణంగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇరాన్‌తో అన్ని రకాల వాణిజ్య, వ్యాపార, ఆర్థిక ఒప్పందాల్ని రద్దు చేసుకుంటున్నాం.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలవుతుంది’’ అని ఇరాన్ విదేశాంగా శాఖ ప్రకటించింది. ఇరాన్ వరుసగా చేస్తున్న మిస్సైల్ దాడులే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణం. యూఏఈ సహా గల్ఫ్ దేశాలకు చెందిన షిప్పింగ్ రూట్లపై ఇరాన్ వరుసగా బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేస్తోంది. అయితే, యూఏఈలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని గుర్తించి ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా ఒక మిస్సైల్ యూఏఈ సరిహద్దు జలాల్లో పడగా, ఇంకోటి దేశంలోనే పడింది. తమ నౌకా మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడికి దిగిందని యూఏఈ వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయెలి బకాయే ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇవి ఆధారం లేని ఆరోపణలు అని, వీటివల్ల ప్రాంతీయ విశ్వాసం దెబ్బతింటుందని ఎస్మాయెలి అన్నారు.
مديرة الاتصال الإستراتيجي في وزارة الخارجية: وقف جميع الأنشطة والتبادلات التجارية والمعاملات المالية مع إيران
Director of the Strategic Communications Department at MoFA: All Trade, Commercial Exchange, and Financial Transactions with Iran Halted pic.twitter.com/PQczXyDNRX
— MoFA وزارة الخارجية (@mofauae) August 18, 2026
ఈ అంశంపై యూఏఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే అక్కడి ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. మిస్సైల్ దాడికి అవకాశం ఉందని, ప్రజలు సురక్షితంగా ఇండ్లలోనే ఉండాలని ఆ అలర్ట్ సారాంశం. అయితే, కొంతసేపటికే ఆ అలర్ట్‌ను అధికారులు ఎత్తివేశారు. మరోవైపు హార్ముజ జలసంధి విషయంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. అమెరికాతో ఒప్పందం కుదిరే వరకు జలసంధి మూసి ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. అయితే, జలసంధి తమ ఆధీనంలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

